స్వచ్ఛ భారత్ లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛతను సాధించి దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది. వరుసగా మూడోసారి స్వచ్ఛ భారత్ అవార్డులను దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. గత మూడేండ్లుగా వరుసగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాగా, జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇదంతా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాల విజయానికి ఇది నిదర్శనం.
స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది. వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించింది. జిల్లాల క్యాటగిరీలో కరీంన గర్ దేశంలోనే మూడోస్థానాన్ని దక్కించుకొన్నది. ప్రతి ఏటా స్వచ్చభారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందజేస్తున్నది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగాల్లో కేంద్రం చేపట్టిన మూడు కార్యక్రమాల్లో తెలంగాణ సత్తా చాటింది.
నవంబరు 1, 2018 నుంచి ఏప్రిల్ 20, 2020 వరకు నిర్వహించిన స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ ఈ ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబరు 15 వరకు నిర్వహించిన కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం- నిర్వహణ, ఆగస్టు 8 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన గందగీ ముక్త భారత్ వ్యర్థాలను తొలిగించే కార్యక్రమాల్లో రాష్ట్రం అద్భుత ఫలితా లను సాధించింది. తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ డీడీడబ్ల్యూఎస్ డైరెక్టర్ యుగల్ జోషి తెలిపారు. జిల్లాల క్యాటగి రీలో కరీంనగర్ మూడోస్థానం దక్కించుకొన్నదని పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాశారు. అక్టోబరు 2వ తేదీన స్వచ్ఛభారత్ దివస్ ను పురస్కరించు కొని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందు చూపుతో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలి తంగానే వరుసగా మూడోసారి స్వచ్చ అవా ర్డులు లభించాయని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అవార్డులు ప్రకటించిన కేంద్రా నికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్వచ్చ భారత్ మిషన్ ను సమర్థంగా అమ లుచేసి అవార్డులు రావడానికి కారకులైన వారందరికీ మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.