27 C
Hyderabad
Friday, December 4, 2020

హరితహారం, గ్రీన్‌ ఇండియా స్ఫూర్తితో… సీడ్‌ ఫ్లాగ్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్ఫూర్తి విస్తృతమవుతున్నది. మొక్కలు నాటడం, సంరక్షించడంపై రాష్ట్రంలో ఈ ఐదేండ్లలో పూర్తి అవగాహన పెంపొందగా, దానిని మరింత విస్తరించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువమందితో ప్రత్యక్షంగా సంబంధం ఉండే కార్యక్రమాలను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ తాజాగా వినాయకచవితి సందర్భంగా ‘విత్తన గణపతిని రూపొందించారు. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పచ్చదనం పెంచేలా ‘సీడ్‌ఫ్లాగ్‌’ నినాదం దేశవ్యాప్తంగా మార్మోగుతున్నది. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా పౌరులు ఎక్కువగా జాతీయపతాకం బ్యాడ్జీని ధరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర కమ్యూనిటీ కేంద్రాల్లో జాతీయపతాకాలతో కూడిన తోరణాలు కడతారు. అయితే త్రివర్ణ పతాకాన్ని ఇప్పుడు విత్తనాలను పొందుపర్చి తయారు చేస్తున్నారు. జాతీయపతాకానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇవి తయారవుతున్నాయి. ‘సీడ్‌ ఫ్లాగ్‌’కు డిమాండ్‌ బాగా పెరగటంతో అమెజాన్‌, పెప్పా, ఇండియా మార్ట్‌ తదితర ప్రఖ్యాత ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ కంపెనీలు మార్కెటింగ్‌ చేస్తున్నాయి.

సీడ్‌ ఫ్లాగ్‌ మందం తక్కువగా ఉండటంతో ఎక్కువగా తులసి విత్తనాలతోనే తయారు చేస్తున్నారు. టమాటా, బంతితో పాటు ఇతర రకాల పూలమొక్కల విత్తనాలను సైతం వాడుతున్నారు. ఉత్సవం పూర్తయ్యాక తోరణాలు, బ్యాడ్జీలను భూమిపై వేసే విషయంలో ఉండే అభ్యంతరాలపైనా తయారీదారులు స్పష్టత ఇస్తున్నారు. సీడ్‌ప్లాగ్‌ లను ఎక్కువగా చెట్ల కుండీలు, పాత కుండలు, ఇతర పాత్రల్లోనే వేస్తారని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచిస్తున్నారు. ‘సీడ్‌ ఫ్లాగ్‌’లో పెట్టేవాటిలో ఇంటి ఆవరణలో పెంచే మొక్కల విత్తనాలే ఉంటాయని చెప్తుతున్నారు. ‘సీడ్‌ ఫ్లాగ్‌’లు కాగితంలోనే తయారవడంతో పాటు, దీనికి వాడే రంగులు కూడా సహజసిద్ధమైనవే. పసుపు, ఆకుకూరలు, నేరేడు తదితర పండ్లు, కూరగాయలతో చేసిన సహజ రంగులను ఉపయోగిస్తున్నారు. హరితహారంపై ప్రజల్లో పెరిగిన అవగాహనతో ఇప్పుడు ఎక్కువమంది ఇలాంటి వాటిని కొనుగోలుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....