21.2 C
Hyderabad
Monday, November 23, 2020

హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైన వరద సాయం

గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం తిరిగి ప్రారంభమైంది. దీంతో పెద్ద ఎత్తున బాధితుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒక్కరోజే 36 వేల కుటుంబాలకు వరద సాయం అందినట్టు తెలుస్తోంది. ఇంటి లొకేషన్, ఆధార్ నంబర్ ద్వారా అధికారులు.. అర్హులను గుర్తిస్తున్నారు. దీంతో అసలైన బాధితులకు పక్కగా పదివేల వరద సాయం అందుతోంది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఇటీవలి భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలకు వరద సాయం తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఒక్కరోజే 36 వేల కుటుంబాలకు వరద సాయం జమ చేసినట్టు తెలిసింది. మీ సేవ కేంద్రాల ద్వారా బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు.. ముంపునకు గురైన ఇంటి లొకేషన్, ఆధార్‌ నంబర్, ఆధారంగా అర్హులను గుర్తిస్తున్నారు. అనంతరం నేరుగా వారి ఖాతాల్లోకి 10 వేల రూపాయలను జమ చేస్తున్నారు. వందేండ్ల తర్వాత రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు కనీవినీ ఎరుగని రీతిలో ముంపునకు గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముంపు సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణ సాయం కింద 550 కోట్ల రూపాయలు విడుదల చేశారు. బాధిత కుటుంబానికి పది వేల చొప్పున ఇప్పటికే 4 లక్షల 75 వేల 871 కుటుంబాలకు 475 కోట్ల రూపాయలకు పైచిలుకు పంపిణీ చేశారు.

చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నేతృత్వంలోని 920 బృందాలు దసరా పండుగ నాడు కూడా వరద సాయాన్ని అందజేశాయి. బాధితులకు వరద సాయం అందజేయడంలో పారదర్శకత పాటించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో అధికారులు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. వరద బాధితుల నుంచి వరుసగా వస్తున్న విజ్ఞప్తుల మేరకు మిగిలిన వారికి వెంటనే వరద సాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజమైన బాధితులు మీ-సేవ కేంద్రాల ద్వారా వివరాలు తెలియజేస్తే అధికారులు పరిశీలించి సహాయం అందజేస్తారని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అవసరమైతే మరో వంద కోట్ల రూపాయలు అయినా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బాధితుడి పేరు, ఇంటి నంబర్, ప్రాంతం, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, పిన్ కోడ్ తదితర వివరాలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా నిర్వహిస్తున్నది.

దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల్లో తమ వివరాలతో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్లు, లొకేషన్ కూడా నమోదు చేస్తున్నారు. వివరాలన్నీ పక్కగా ఉన్న దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్ లో నమోదవుతుండడంతో అర్హులను గుర్తించడం అధికారులకు సులభమవుతున్నది. దరఖాస్తులో ఇంటి లొకేషన్ ఉండడంతో అధికారులు ఆ ప్రాంతంలో నమోదైన వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని ముంపునకు గురైన ప్రాంతమా? లేదా అని గుర్తిస్తున్నారు. ఆధార్‌ నంబర్ ద్వారా గతంలో వరద సాయం పొందినది, లేనిది నిర్ధారించుకుంటున్నారు. ఇలా ఆమోదం పొందిన దరఖాస్తులు నేరుగా ఆర్థికశాఖకు చేరుతుండడంతో అక్కడి నుంచే దరఖాస్తుదారుడి బ్యాంకు అకౌంట్లలోకి 10 వేల

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...