25.4 C
Hyderabad
Sunday, January 17, 2021

హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులు : సీఎం కేసీఆర్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. ఓట్లు వేసే ప్రజలు విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు చెప్పే మాటలు, వారు ప్రతిపాదిస్తున్న ఎజెండాలు, ఇస్తున్న హామీల మీద చర్చ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సరైన నాయకులను ఎన్నుకుంటేనే.. ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పార్టీ నాయకుడు, ప్రభుత్వ దృక్పథం ఎలా ఉందో ప్రజలు చర్చించాలని ప్రజలకు సీఎం సూచించారు.

తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టనప్పుడు చాలామంది ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారు. లేనిపోని అబద్ధాలు ప్రచారం చేశారు. పరిశ్రమలు వెళ్లిపోతాయని.. విద్యుత్‌ లోటు ఏర్పడుతుందని, నక్సలిజం పెరుగుతుందని ఎన్నో లేనిపోని శాపాలు పెట్టారని సీఎం గుర్తు చేశారు. అయినప్పటికీ.. తెలంగాణ, హైదరాబాద్ చాలా చైతన్యాన్ని కలిగిన ప్రాంతాలని ఆయన అన్నారు. ఎవరు ఏం చెప్పినా.. వింటారు గానీ.. ఏం చేయాలో తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్‌ ప్రజలకు తెలుసు అని సీఎం అన్నారు. తెలంగాణ సాధించే వరకే.. టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ.. రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమ కర్తవ్యం నెరవేరింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను గుర్తించి టీఆర్‌ఎస్ రాజకీయ పరిణితిని ప్రదర్శించిందని సీఎం అన్నారు. దేశం ఉహించని సభలు తెలంగాణలో ఎన్నో జరిపినం. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం జరిగిన ఆ సభలు చూసి.. యావత్‌ భారతదేశం ఆశ్చర్యపోయింది. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది.. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఈ క్రమంలో చాలా కార్యక్రమాలు చేపట్టినం. ఎన్నో పథకాలు తీసుకొచ్చినం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు, తేవాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయడం అంత సులభం కాదు. అందుకు కాస్త సమయం పడుతదని ఆయన తెలిపారు. మంచీ చెడులకు సాక్షిగా ఉన్న హైదరాబాద్‌ నగరం అభివృద్ధి కావాలంటే ఏం చేయాల్నో నగర ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి అన్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...