19.5 C
Hyderabad
Friday, November 27, 2020

హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది -మంత్రి కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 నుంచి పాత ముంబై రోడ్డు లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్డును మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. మొదటి దశలో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి 313కోట్ల 65 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. వేగంగా పెరుగుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...