19.5 C
Hyderabad
Friday, November 27, 2020

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణకే తలమానికం

ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో, లా అండ్‌ ఆర్డర్‌ కూడా అంతే ముఖ్యం. అందుకే సీఎం కేసీఆర్ డే వన్ నుంచే శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ చేయూతతో గత ఆరేళ్లుగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఎక్కడా ఏ చిన్న సంఘటన జరగకుండా పోలీస్ శాఖ అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తోంది. టెక్నాలజీ పరంగా మరో అడుగు ముందుకేస్తూ, తెలంగాణ ప్రభుత్వం బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు 600 కోట్ల రుపాయలతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 14 వ అంతస్తులో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీ, నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడ్డాక.. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ ముఖ్యమని భావించిన సీఎం కేసీఆర్‌.. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు రూ. 600 కోట్లతో చేపట్టిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందన్న మంత్రి కేటీఆర్‌.. ఈ సెంటర్ తో హైదరాబాద్‌ నగరం మరింత సురక్షితంగా, భద్రంగా మారుతుందన్నారు. హైదరాబాద్‌ మహా నగరాన్ని, మన రాష్ర్టాన్ని అత్యంత సురక్షితమైన, అత్యంత భద్రమైనదిగా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు. దాదాపుగా 90 శాతం పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మరొక రెండు, మూడు నెలల్లో నిర్మాణం పూర్తై అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. అత్యాధునికమైన టెక్నాలజీతో 19 అంతస్తుల్లో చాలా ఆధునికంగా ఈ ఐకానిక్‌ టవర్‌ మన ముందుకు రాబోతుందని చెప్పారు మంత్రి కేటీఆర్. 

శాంతి భద్రతల పర్యవేక్షణకు దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌  సెంటర్‌ సిద్ధమవుతోంది. సుమారు రూ. 600 కోట్ల రూపాయల వ్యయంతో సెంటర్‌ నిర్మాణమవుతోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి అంగుళం పోలీస్‌ రాడార్‌ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే సీసీసీ బిల్డింగ్‌ నిర్మాణం దాదాపు పూర్తైంది. శాంతి భద్రతలు మాత్రమే కాకుండా.. విపత్తు నిర్వాహణ, పండుగలు, గణేశ్‌ నిమజ్జనం తదితర కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించే వీలుంటుంది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో మినీ కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసి వాటిని ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నారు. అత్యాధునికమైన డేటా సెంటర్‌, ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అత్యున్నతస్థాయిలో ఆపరేషన్స్‌ ఏర్పాట్లు ఉన్నాయి. 14వ అంతస్తు వరకు విజిటర్స్‌కు అవకాశం కల్పిస్తూ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసేలా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో భారత్‌లోనే మొదటిది కాగా.. ప్రపంచంలో ఇలాంటి సెంటర్‌లు వేళ్లమీద లెక్కపెట్టేవి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌  సెంటర్‌ లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పెండింగ్ పనులు కూడా పూర్తయితే ఈ సెంటర్ తెలంగాణకే తలమానికంగా నిలవనుంది.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...