19.5 C
Hyderabad
Friday, November 27, 2020

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సైబర్ టవర్ దగ్గరి సిగ్నల్ జంప్ చేసి అతి వేగంగా దూసుకెళ్లిన బెంజ్‌ కారు.. బుల్లెట్ బైక్ పై వెళుతున్న భార్య భర్తలను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న గౌతమ్ దేవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య శ్వేతకు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన సమీప వైద్యశాలకు తరలించారు. కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశి విశ్వనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...