19.4 C
Hyderabad
Monday, November 30, 2020

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి లింక్ రోడ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌ లో ట్రాఫిక్‌ స‌మ‌స్యలను ప‌రిష్కరించ‌డంలో భాగంగా.. ప్రభుత్వం లింక్ రోడ్ల నిర్మాణాల‌ను చేప‌ట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా జూబ్లిహిల్స్ రోడ్ 45 నుంచి రాయదుర్గం లెదర్ పార్కు వరకు నిర్మించిన లింక్‌ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత లెద‌ర్ పార్క్ వ‌ద్ద జీహెచ్ఎంసీ చేప‌ట్టిన వీయూసీ వంతెన ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంతరం పాత ముంబై హైవే నుంచి ఖాజాగూడ వ‌ర‌కు నిర్మించిన లింక్‌ రోడ్‌ ను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.