27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

హైదరాబాద్ లో మెట్రోకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు మళ్లీ పరుగు పెట్టనున్నాయి. 21వ తేదీ నుంచి పెండ్లిళ్లు, అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కోవిడ్ కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‌లాక్‌ -4 ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌ పార్కులు, థియేటర్లు లాంటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 7వ తేదీ నుంచి మెట్రో రైల్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ పాటిస్తూ లాక్‌డౌన్‌కు ముందు ఉన్న అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నది. 

అటు ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌ టీచింగ్‌, టెలీకౌన్సెలింగ్‌, దీనికి సంబంధించిన పనులకు విద్యాసంస్థలకు ఒకే సమయంలో 50 శాతం టీచింగ్‌-నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 21 నుంచి ఐటీఐలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు, ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ, పీజీ టెక్నికల్‌ ప్రోగ్రాంలకు కూడా పర్మిషన్‌ ఇచ్చింది. సోషల్‌, అకడమిక్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌, కల్చరల్‌, రిలీజియస్‌, రాజకీయ సమావేశాలతోపాటు ఇతర జనసమూహ కార్యక్రమాలను వందమందికి మించకుండా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...