20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

హైదరాబాద్ వాసులకు ఆపద్బాంధవుడిగా మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లో కుంభవృష్టితో వందలసంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. రికార్డుస్థాయి వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రకృతి కన్నెర్ర చేసినప్పటికీ, .. బాధితులకు అండగా మేమున్నామంటూ రాష్ట్రప్రభుత్వం సాంత్వన కలిగించింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ రెండురోజులుగా నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదృతంగా పర్యటిస్తూ, బాధితులకు భరోసానిస్తున్నారు. వరుసగా రెండోరోజూ గల్లీగల్లీలో తిరుగుతూ ఆయన ఆత్మీయ స్వర్శను అందించారు. ముంపునకు గురైన కాలనీల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు విన్నవించిన సమస్యలను ఓపిగా విన్న మంత్రి.. వీలైన చోట అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. బురదనీటిలో నడుస్తూ, ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. బాధితులందరినీ ఆదుకుంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.

ముషీరాబాద్‌ నియోజకర్గం నల్లకుంటలోని శ్రీరాంనగర్‌ బస్తీలో నీటమునిగిన ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అటు అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌, పటేల్‌నగర్‌, కాలనీలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం టోలీచౌకీలోని నదీం కాలనీలో నీళ్లు నిండిన ప్రాంతాన్ని పరిశీలించారు. నల్లకుంట, అంబర్‌పేట కాలనీల్లో నీళ్లునిండిన కాలనీల్లో వరద నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన శాశ్వత ప్రాతిపదికగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన నిర్మాణాలు, కాలనీల్లో వేయాల్సిన పైప్‌లైన్లు, డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నల్లకుంటలోని నాలాలను పరిశీలించిన మంత్రి అక్కడ రిటైనింగ్‌ వాల్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన అన్నిరకాల ఆహారం, దుప్పట్లు, మందులు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రజలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. వరద తగ్గిన తర్వాత మురుగునీరు వల్ల రోగాలు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.

అటు హైదరాబాద్‌ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమీక్షించారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో సహాయ చర్యల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులపైనా

సమీక్షించేందుకు వీలుగా సీడీఎంఏ పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

మొత్తంగా వరద నీటితో హైదరాబాద్ నగర వాసులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్ వారిని పరామర్శించి.. మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. కష్టకాలంలో వెన్నంటి ఉండి, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామంటూ ప్రజలకు ధైర్యానిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...