17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

‌ రాష్ట్రంలో డిజిటల్‌ క్లాసులకు మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి డిజిటల్‌ విధానంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీచేసింది. విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో పాఠాలు చెప్పే క్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రగ్యాత అనే పేరుతో విడుదలచేసిన మార్గదర్శకాలు ఎస్సీఈఆర్టీ వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అమలుచేయాల్సి ఉందని పేర్కొంది. కిండర్‌గార్డెన్‌, నర్సరీ, ప్లేస్కూల్‌, ప్రీస్కూల్‌ విద్యార్థులకు గరిష్ఠంగా రోజూ 45 నిమిషాలకు మించకుండా వారానికి మూడ్రోజులు మాత్రమే బోధన జరుగాలని ఆదేశాలు జారీ చేసింది. అదికూడా పెద్దలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో జరుగాలని స్పష్టం చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోజూ రెండు తరగతుల చొప్పున వారంలో ఐదు తరగతులకు మించి తీసుకోరాదని తెలిపింది. గరిష్ఠంగా ఒకటిన్నర గంటలే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని పేర్కొంది.  6 నుంచి 8వ తరగతుల వారికి రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మించకుండా మూడు సెషన్లలో క్లాసులు తీసుకోవాలని నిర్ణయించింది. గరిష్ఠంగా రెండు గంటలే బోధించాలని స్పష్టం చేసింది. 9-12వ తరగతి వరకు ఒక్కో క్లాసు 30-45 నిమిషాలకు మించకుండా.. నాలుగు సెషన్లలో బోధన సాగాలని, మొత్తంగా రోజుకు 3 గంటలు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

డిజిటల్‌ పాఠాల బోధనలో ప్రధానోపాధ్యాయులకు కూడా మార్గదర్శకాలు జారీచేసింది. గురువారం నుంచి టీచర్లు, సిబ్బంది కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ-లెర్నింగ్‌ విధానాన్ని వెనకబడిన ప్రాంతాల విద్యార్థులందరికీ అందుబాటులో తేవాలి. డిజిటల్‌ పాఠాలు అందరికీ అందించాలి. 1.టీసాట్‌ లేదా దూరదర్శన్‌ చానెల్‌. 2.స్మార్ట్‌ఫోన్‌ , మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్స్‌ లేదా కంప్యూటర్లు ఇంటర్నెట్‌తో ఉండడం. 3.విద్యార్థులకు టీసాట్‌,దూరదర్శన్‌, స్మార్ట్‌ఫోన్లు, మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ లేనివారిని వేర్వేరుగా గుర్తించాలి. విద్యార్థులకు టీవీ అందుబాటులో లేకపోతే ప్రధానోపాధ్యాయులు గ్రామ పంచాయతీ, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి డిజిటల్‌ పాఠాల కోసం సహకారం పొందాలి. టీవీలు అందుబాటులో ఉన్న విద్యార్థులతో టీవీలులేనివారిని జత చేయాలి. స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి సేవలు ఉపయోగించుకోవాలి. అలాగే ఎస్సీఈఆర్టీ ప్రత్యామ్నాయ విద్యాక్యాలండర్‌ ప్రకారం రెండుస్థాయిల్లో బోధించాలి. లెవల్‌-1లో లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌,  లెవల్‌-2లో వర్క్‌ షీట్లు ఆధారంగా లెర్నింగ్‌ అవుట్‌ కమ్‌ను సాధించడం. ఐదో వారం నుంచి స్కూళ్లు, టీచర్లు వర్క్‌ షీట్లు స్థాయిలవారీగా రూపొందించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువాలి. డిజిటల్‌ పాఠాల కోసం పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపింది.  ఇంటర్నెట్‌ సౌకర్యంతో స్మార్ట్‌ ఫోన్‌, కంప్యూటర్‌ ఉపయోగిస్తే దానివల్ల కలిగే సైబర్‌ ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని పేర్కొంది.

2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. బడి బయట పిల్లలను, వలస కార్మికుల పిల్లలను, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను కూడా గుర్తించాలి. వారికి కూడా డిజిటల్‌ బోధన కొనసాగించాలి. అడ్మిషన్ల వివరాలను సమగ్ర శిక్షా అభియాన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఛైల్డ్‌ ఇన్ఫో అప్లికేషన్‌’లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలలో పేర్కొంది.  మరోవైపు జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కాలేజీల్లో ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 27 నుంచి అన్ని కాలేజీల అధ్యాపకులు హాజరు కావాలని ఆదేశించింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...