మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా ప్రగతి భవన్లో 21 అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మూడు చొప్పున అంబులెన్స్‌లను అందజేశారు. వీరితో పాటు ఎంపీలు రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి 3 అంబులెన్స్‌లు అందజేయగా.. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి 2 అంబులెన్సులు.. మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, వరంగల్‌కు చెందిన లక్ష్మణ రావు ఒక్కో అంబులెన్స్ అందజేశారు. వీటిని హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు వినియోగించనున్నారు.