20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

24గంటల్లో 17,296 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17వేల296 కొత్త కేసులు నమోదు కాగా.. మరో 401 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 4లక్షల90వేల401కు,మరణాలు 15వేల301కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 2లక్షల 85వేల637 మంది కోలుకోగా ..యాక్టివ్‌ కేసులు లక్షా 89వేల463 అని తెలిపింది. మరోవైపు కరోనా తీవ్రత పెరుగుతున్న రాష్‌ర్టాల్లో ఇవాళ్టి నుంచి కేంద్ర బృందం పర్యటిస్తుంది. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటిస్తున్న లవ్‌ అగర్వాల్‌ టీమ్‌ 29న కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...