20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

24 గంటల్లో 14,821 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారివేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. 8రోజుల్లోలక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24గంటల్లో 14వేల 821 కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 25వేల 282కి చేరింది.  తాజాగా 445 మంది మరణించడంతో మృతుల సంఖ్య 13,699కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టీవ్‌ కేసులు లక్షా 74వేల 387కు చేరుకోగా.. 2లక్షల 37వేల 196మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ , ఢిల్లీలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్‌ లో జూలై 1 నాటికి కరోనా కేసులు 6 లక్షలకు చేరతాయన్న మిచిగన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ భ్రమర ముఖర్జీ స్టేట్‌ మెంట్‌ భారతీయులను కలవరపరుస్తోంది

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...