భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గంటగంటకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలో 24వేల248 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల97వేల 413కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్నటికి నిన్న 425 మందిని కరోనా పొట్టనపెట్టుకోగా… మరణాల సంఖ్య 19వేల693కు చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 2లక్షల53వేల287గా ఉండగా.. చికిత్సతో 4లక్షల24వేల433మంది బాధితులు కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ 3వ స్థానానికి చేరిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే దేశంలో 78 శాతం కేసులు కేవలం 7 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది.
