23.2 C
Hyderabad
Sunday, September 20, 2020

28న పీవీ శత జయంతిని ఘనంగా నిర్వహించాలి

మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించేలా 51 దేశాల్లోని ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచే రాష్ట్ర అస్థిత్త్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో ముందు వరుసలో ఉన్నదన్నారు. ఈ మేరకు పార్టీలకతీతంగా పివి నర్సింహారావు, ఈశ్వరీబాయి, వెంకటస్వామి లాంటివారి సేవలను స్మరించుకుంటూ వారి జయంతులను అధికారికంగా జరిపేలా సీఎం కేసీఆర్ అదేశాలిచ్చారన్నారు. జయశంకర్ సార్ తో పాటు, పివి నర్సింహారావు, కొమ్రంభీం వంటి మహనీయుల పేర్లను యూనివర్సీటీలు, జిల్లాలకు పెట్టి స్మరించుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్.

తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతారాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ నర్సింహారావు అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. కానీ ఆయనకు రావాల్సిన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న దక్కాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈమేరకు ప్రధానిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలను మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకునిగా, ప్రధానిగా అధ్భుతమైన సేవలందించిన మహనీయుడి జయంతిని సంవత్సరంపాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యునిగా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలను నియమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏన్నారైలు అందరూ పీవీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గోనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంఘాలతో పాటు తెలుగు సంఘాలతోనూ సమన్వయం చేసుకొని ఈ ఉత్సవాలను నిర్వహించాలన్నారు. అన్ని దేశాల్లోని తెలుగువారందరినీ కలుపుకొని పీవీ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పారు.

28న జరిగే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ నెక్లేస్ రోడ్ లోని జ్ఞానభూమిని సందర్శించారు. జీహెచ్‌ఎంసీ మేయర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిలతో కలిసి పనులను పరిశీలించారు. పీవీ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.   

- Advertisement -

Latest news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

Related news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్

పేద దేశాల్లో క్రైస్త‌వ మిష‌న‌రీలు అందిస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన...

నేరెడ్‌మెట్ లో‌ విషాదం…

నగరంలోని నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. సుమేధ‌(12)‌ అనే బాలిక నిన్న సాయత్రం 7 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిన...

బీహార్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో పలు జిల్లాలు నీట మునిగాయి. వరద ఉదృతి పెరగడంతో కిషన్‌గంజ్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి...