బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ నెల 13 వరకు అఖిలప్రియ పోలీసుల కస్టడీలో ఉండనుంది. మూడు రోజుల కస్టడీలో భాగంగా కిడ్నాప్ వ్యవహారంపై అఖిలప్రియను పోలీసులు లోతుగా ప్రశ్నించనున్నారు.