29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నగరంలో భారీగా తుక్కు వాహనాలు

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా 20 ఏండ్లు దాటిన వాహనాల్ని తుక్కుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సారి ప్రత్యేకంగా బడ్జెట్ లోనే ఈ విషయం ప్రస్తావిస్తూ నూతన విధానాన్ని తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏండ్లుగా, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏండ్లుగా నిర్ణయించారు. దీంతో గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే 20 ఏండ్లు దాటిన వాహనాలు దాదాపు 3 లక్షల వాహనాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20 లక్షల వాహనాలు ఉంటే.. అందులో సగం గ్రేటర్‌ పరిధిలోనే ఉన్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్‌లో మొత్తం వాహనాలు 56 లక్షల వరకు ఉంటే, అందులో 20, 15 ఏండ్లు నిండిన వాహనాలు 3 లక్షలకు పైగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

- Advertisement -

Latest news

Related news