హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారని.. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని’ సీఎం కోరారు.

హైదరాబాద్ చైతన్యవంతమైనది. ఎంతో చరిత్ర ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్ అని కేంద్రం చెప్పింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికాం. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామని’ సీఎం అన్నారు.