హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన బాధితులకు వరద సాయం కొనసాగుతోంది. గ్రేటర్ పరిధిలో అర్హులకు అధికారులు వరద సాయం అందిస్తున్నారు. సోమవారం నాడు 10,005 మందికి రూ.10కోట్ల వరద సాయం అందించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గత మంగళవారం నుంచి.. 48 వేల 232 మంది లబ్ధిదారులకు 48.23 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్టు సీపీఆర్ఓ, జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.