24.2 C
Hyderabad
Friday, January 22, 2021

మార్చిలోగా సింగరేణిలో 651 పోస్టుల భర్తీ.. సీఎండీ శ్రీధర్‌

సింగరేణిలో ఖాళీగా ఉన్న 651 ఉద్యోగాలను మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు. ఇందులో 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులు ఉన్నాయని, వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇవేకాకుండా త్వరలో అంతర్గత సిబ్బందితో 1,436 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో పని చేస్తూ అర్హత ఉన్న ఉద్యోగులతో భర్తీ చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దానికి అనుగుణంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 13,934 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు శ్రీధర్‌ ప్రకటించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులంతా కష్టపడి చదివి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.

కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్‌ ట్రెయినీలు, మిషన్‌ ట్రెయినీలు, మోటార్‌ మెకానిక్‌, మౌల్డర్స్‌ పోస్టులున్నాయి. అధికారుల స్థాయిలో పర్సనల్‌ ఆఫీసర్లు, మెయిన్‌మేంట్‌ ట్రెయినీలు, వివిధ జూనియర్‌ ఫారెస్ట్‌ అధికారుల పోస్టులున్నాయి. వీటితో పాటు జూనియర్‌ స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌లు తదితర వైద్య సిబ్బందిని సైతం త్వరలోనే నియమిస్తామని సీఎండీ చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

మగవాళ్లను భయపెడుతున్న కోవిడ్ కొత్త సర్వే

వ్యాక్సిన్ వచ్చి.. మెల్లగా కరోనా తగ్గిపోతుందన్న సందర్భంలో.. ఓ కొత్త న్యూస్ భయపెడుతుంది. వైరస్ సోకిన పురుషుల్లో అతికొద్ది మందికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తోంది.