మై విలేజ్ షోతో ఫేమస్ అయిన గంగవ్వ బిగ్ బాస్ 4వ సీజన్ లో కంటెస్టెంట్గా పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది. నాలుగు వారాలు బిగ్ బాస్ ఇంట్లో బాగానే ఉన్న గంగవ్వ అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఇమడలేకపోయింది. బయటకు వచ్చేసింది. హౌజ్ నుంచి బయటకు వస్తూ తన కోరికను నాగార్జునకు చెప్పింది. ఇల్లు కట్టివ్వండి అని గంగవ్వ నోరు తెరిచి అడగడంతో ఆ బాధ్యతను భుజాన వేసుకున్న నాగార్జున తప్పకుండా ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాడు. ఆ హామీ ప్రకారం ఇంటి నిర్మాణం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్నిగంగవ్వ బిగ్ బాస్ ఫినాలే రోజు వేదిక మీద చెప్పుకొచ్చింది.
ఎలా ఉన్నావు గంగవ్వ, బిగ్ బాస్ తర్వాత నీ జీవితం ఎలా ఉంది అని అడిగిన నాగార్జున ప్రశ్నలకు గంగవ్వ సంతోషంగా.. నవ్వుతూ సమాధానమిచ్చింది. తనను కలవడానికి చాలామంది కార్లలో వచ్చిపోతున్నారని మురుస్తూ చెప్పొకొచ్చింది. అందరితో మాట్లాడలేక నా నోరు నొస్తుంది అని చెప్పింది. తన సొంతింటి కల నెరవేరిందని చెప్తూ.. పెద్దన్న బిగ్ బాస్, చిన్నన్న నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పింది. ముగ్గు పోసిన, కొన్నాళ్ళలో ఇల్లు పనులు అయిపోతయని తెలిపింది. గంగవ్వ ఇంటి పనులకి సంబంధించి వీడియోని ఫినాలే రోజు బిగ్ బాస్ స్రీన్ మీద ప్లే చేసి చూపించారు.