28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలి.. సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. కీలక అంశాలపై చ‌ర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగ‌తి భ‌వ‌న్‌లో సోమవారం మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖ, అటవీశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విసయం తెలిసిందే.

రెవెన్యూకు సంబంధించి అన్నిరకాల సమస్యలు సత్వరం పరిష్కరించాలన్నారు. ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్నిరకాల మార్పులు చేర్పులు వారంరోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే కరోనా టీకా పంపిణీకి వెంటనే ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేసి వెంటనే అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు నిర్మించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అర్హులకు వెంటనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆయాశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...

కాల్పుల వర్షం కురిపించే ఫైరింగ్‌ షూ

మామూలుగా సైనికులు తుపాకులతో శత్రవులపై కాల్పులు జరుపుతారు. అవే కాల్పులు షూస్‌తో జరిపితే ఎలా ఉంటుంది. చేతిలో తుపాకీ పట్టుకోకుండా కాలికి ధరించిన చెప్పులతోనే బుల్లెట్ల వర్షం కురిపిస్తే శత్రువు...