హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. మాస్ మ్యూచువల్ కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడంతో రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అమెరికా వెలుపల రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
‘ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒకటైన మాస్ మ్యూచువల్ను రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని’ రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.