32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

మాజీ మంత్రి అఖిల ప్రియకు బెయిల్

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ-1 నిందితురాలిగా ఉన్న ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరైంది. బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావు అతని సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి అఖిల ప్రియపై పలు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇవాళ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా భూమా అఖిల ప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో ఏ-3 నిందితుడిగా ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Latest news

Related news