32.7 C
Hyderabad
Monday, March 1, 2021

పేదలకు మెరుగైన వైద్య సేవలు.. కేటీఆర్

ఇకపై ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంఆర్ఐ, అల్ల్రా సౌండ్, సిటీ స్కాన్, ఈసీజీ వంటి ప‌రీక్ష‌లు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ శ్రీరామ్‌న‌గ‌ర్‌లో డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్ట‌ణ‌ పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను ప్రారంభిస్తున్నామ‌న్నారు. తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో మొత్తం 57 ర‌కాల ర‌క్త ప‌రీక్ష‌ల‌ను చేస్తున్న‌ట్లు చెప్పారు.  క‌రోనా కాలంలో వైద్యులు, ఇత‌ర సిబ్బంది అందించిన సేవ‌ల‌ను ప్ర‌భుత్వం ఎప్ప‌టికీ మ‌రిచిపోదన్నారు. భ‌విష్య‌త్‌లో జిల్లా కేంద్రాల‌కు డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేటీఆర్ చెప్పారు.

లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట్‌, బార్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండిల్లో  డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఈటల రాజేందర్‌, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు లాలాపేట డయాగ్నొస్టిక్స్‌ కేంద్రం ప్రారంభోత్సవంలో వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

- Advertisement -

Latest news

Related news