26 C
Hyderabad
Wednesday, January 27, 2021

మెదక్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. ఐదు నెమళ్లు మృతి

తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలను విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్ని కూడా వణికిస్తోంది. కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌లో బర్డ్ ఫ్లూ భయాందోళనలకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూను కట్టడి చేసేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల పక్షులు, కోళ్లు మృతి చెందుతున్నాయి.

తాజాగా మెదక్‌ జిల్లా పాపన్నపేట శివారు అటవీ ప్రాంతంలో ఐదు నెమళ్లు మత్యువాత పడ్డాయి. కుళ్లిన స్థితిలో ఉన్న వాటి మృతకళేబరాలు పశువుల కాపరి గుర్తించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో స్థానికంగా బర్డ్‌ఫ్లూ కలకలం మొదలైంది. కానీ, స్థానిక పశు సంవర్థక అధికారి మాత్రం అజీర్ణంతో చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు.

వరంగల్ జిల్లాలో కూడా ఓ రైతుకు చెందిన సుమారు 120 నాటు కోళ్లు మృతి చెందాయి. దీంతో వాటి శాంపిల్స్ సేకరించి అధికారులు పరీక్షలకు పంపారు. మరోవైపు పౌల్ట్రీ రైతులతోపాటు అందరూ తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

- Advertisement -

Latest news

Related news

వంటిమామిడిలో కోల్డ్ స్టోరేజ్ కడుతాం : సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లోని రైతులతో మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటి మామిడి కూరగాయల మార్కెట్లో...

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...