29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

విమానరంగంలో తెలంగాణకు భారీ ప్రాజెక్ట్

తెలంగాణకు మరో ఘనత దక్కింది. పాపులర్ విమానాల తయారీ సంస్థ అయిన బోయింగ్‌ తన ‘737’ మోడల్‌ విమానాల విడిభాగాలను హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది
విమానం తోక భాగంలోని కొన్ని భాగాలను హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌లో తయారుచేస్తామని బోయింగ్ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్‌ గుప్తే మాట్లాడుతూ.. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో భారత్‌ స్వయం సమృద్ధి సాధించేందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
ఇకపోతే.. అత్యుత్తమ మౌలిక వసతులు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, బాధ్యతాయుతమైన ప్రభుత్వం.. ఈ లక్షణాలు ఉండడం వల్లనే తెలంగాణకు పరిశ్రమల రాక ఎక్కువైందని సలిల్ గుప్తే ప్రశంసించారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, శిక్షణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

- Advertisement -

Latest news

Related news