21.7 C
Hyderabad
Friday, January 22, 2021

కెప్టెన్ ఇంట్లో బొమ్మల కొలువు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్డు లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రుక్మిణి కళ్యాణం సన్నివేశాలను బొమ్మల కొలువు రూపంలో ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణునితో రుక్మిణీ కళ్యాణ ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు సందర్శకులను కట్టిపడేస్తోంది. రకరకాల విగ్రహాలు, దేవతామూర్తులతో ఆకట్టుకునే విధంగా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు భార్య సరోజినీదేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ భార్య డాక్టర్ షమిత, కూతురు డాక్టర్ పూజిత బొమ్మల కొలువును ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బొమ్మలకొలువు ద్వారా పురాణ ఘట్టాలను నేటి తరాలకు సులభంగా తెలిపే విధంగా అవగాహన కల్పించవచ్చన్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...