రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నేరేడ్మెట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత సీపీ మహేష్ భగవత్ మల్కాజిగిరి పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిండు.
వ్యాక్సిన్ తీసుకున్నాక తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహ వద్దని సీపీ అన్నారు. యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల్లోని సుమారు ఆరువేల మంది పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా సీపీ చెప్పారు.