29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం

కొత్త సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్నికళియతిరిగి పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడి పనులు సాగుతున్న తీరును అడిగి తెలసుకున్నారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా సీఎం ఇంజినీర్లను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. రూ.617 కోట్లతో చేపడుతున్న కొత్త సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news