తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని కాశీ విశ్వనాథున్ని దర్శించి, స్వామీ వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేసి గంగా ఆర్తి, గంగా పూజను తిలకిస్తారు. అక్కడి నుంచి సంకట్మోచన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం సతీమణి శోభతోపాటు కుటుంబసభ్యులతో వారణాసికి వెళ్లే ముందు దిగిన ఫోటోని ఎమ్మెల్సీ కవిత ట్విటర్లో షేర్ చేసింది. పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథున్నిదర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో వెళ్తుండటం సంతోషంగా ఉందని కవిత ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.