32.7 C
Hyderabad
Monday, March 1, 2021

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను నిర్మించే విషయమై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో బుధవారం సమావేశం జరిగింది. ముస్లిం,  క్రిస్టియన్, హిందూ మతాల ప్రతినిధులు, సెక్రటేరియట్ ఉద్యోగులతో మంత్రులు చర్చించారు. కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు మరోసారి స్పష్టం చేశారు. సచివాలయంతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా సకాలంలో పూర్తవుతాయన్నారు.

- Advertisement -

Latest news

Related news