32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

త్వరలో కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు: సీఎం కేసీఆర్

నల్గొండ జిల్లాలో పర్యటనలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. తర్వాత హాలియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూనే.. తమ ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించారు.

పంచాయతీలకు ప్రత్యేక నిధులు

నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తం. వీటితోపాటు మండల కేంద్రానికి రూ.30 లక్షలు ఇస్తం. నల్గొండకు రూ.10 కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లతోపాటు జిల్లాలోని ఒక్కో మూన్సిపాలిటీకి రూ.కోటి చొప్పున అందిస్తం. మొత్తంగా నల్గొండ జిల్లాకు రూ.186 కోట్ల ప్రత్యేక నిధులను అందిస్తం.

త్వరలోనే పట్టాలు

నాగార్జున సాగర్ లోని నెల్లికల్, చింతల పాలెంలో 4, 5 వేల ఎకరాల్లో ఉన్న వివాద విషయాన్ని త్వరలోనే తేల్చుతం. ఆ సమస్యకు రెండు మూడు రోజుల్లో శాశ్వతంగా తీరిపోతది. సమస్యలన్నింటిని పరిష్కరించి త్వరలోనే మంత్రి జగదీష్ ఆధ్వర్యంలో మీకు పట్టాలు అందిస్తం.

కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు

రాష్ట్రంలో కరోనా వల్ల చాలా పనులు పెండింగ్ పడ్డయ్. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మంచిగా అవుతున్నయ్. త్వరలోనే కొత్త ఫించన్లను అందిస్తం. నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తం.

రూ.2500 కోట్లతో పనులు

నల్గొండ జిల్లా వెనుకబడిన జిల్లా.. గతంలో ఎవరూ పట్టించుకోలే. మా ప్రభుత్వం వచ్చినాక నల్గొండ జిల్లాలో సమస్యలను పరిష్కరిస్తున్నం. హూజుర్ నగర్ ఎన్నికల నుంచి నల్గొండ సమస్యలు నాకు తెలుస్తున్నయ్. మీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాకు చెబతున్నరు. నెల్లికల్, బరాకత్ గూడెం, ముత్యాల ఘాట్ కెనాల్, బొత్సలపట్టి, దున్పోతుల పల్లి, కంబాల పల్లి, అంగడిపేట, జాన్ పహాడ్, ముక్త్యాల బ్రాండ్ కెనాల్ లాంటి 13 లిఫ్ట్ స్కీంలకు  సూమారు రూ.2500 కోట్లతో పనులు చేసేందుకు ఇందాకే శంకుస్థానప చేసిన. దిండి లిఫ్ట్ పూర్తయితే రైతులు దర్జాగా బతికే కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ప్రజలు వీటన్నిటిని గమనించాలి.  గ్రామాలకు పోయినంగ అందరూ ఆలోచన చేయాలి.

రూ.600 కోట్లతో ప్రణాళిక

లిఫ్ట్ స్కీం, ఎడమ కాల్వలలో నీళ్లు పారితే.. నల్గొండ నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. శ్రీశైలం నుంచి పాలేరు రిజర్వాయర్ నుంచి దేవుల పల్లి లిఫ్ట్ పెడితే శాశ్వశంగా నీళ్ల సమస్య తీరుతుంది. దీని కోసం రూ.600 కోట్లతో ప్రణాళిక పూర్తైంది. నల్గొండ పచ్చగా మారేందకు చేయాల్సింది అన్ని చేస్తున్నం. కృష్ణా, గోదావరి నీళ్లను తెచ్చి నల్గొండ కాళ్లు కడుగుతాను.

టీఆర్ఎస్ వీరుల పార్టీ

నల్గొండ జిల్లాలో మొదలెట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తైయ్యేలా నేను పర్యవేక్షిస్తా. ఎడమ కాల్వ కింద ప్రతి ఎకరాకు నీరు అందిస్తం. టీఆర్ఎస్ వీరుల పార్టీ, వీపు చూపే పార్టీ కాదు. నేను మాట ఇచ్చినా.. పూర్తి చేసే బాధ్యత మంత్రులదే. పనులు పూర్తి కాకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. ఛాలెంజ్ తీసుకుందామా… అందరూ కష్టపడాలి. రాబోయే ఏడాదిన్నరలో పనులు పూర్తి జేయాలే.

పోడు భూములు

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను. నల్గొండ జిల్లాలోపాటు రాష్ట్రంలో పోడు భూములు సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నరు. త్వరలోనే జిల్లాకు ఒకటి రెండు రోజులు పోయి.. అక్కడే ఉండి.. పోడు భూముల  సమస్యలను పరిష్కారం చేస్త.

నోముల లేకపోవడం భాధాకరం

తెలంగాణ సాధనలో నాతోపాటు ఉద్యమం చేసిన నోముల ఇవాళ నా పక్కన లేడు. బాధగా ఉంది. ఈరోజు మన మధ్యలో నోముల లేకపోవడం లోటుగా ఉంది.

రాక్షసులతోనే కొట్లాడిన చరిత్ర మాది

కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదు..  తాము తలుచుకుంటే వాళ్లు మిగలరు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. హద్దు మీరినప్పుడు ఏం జేయాలో తమకు తెలుసు. తొక్కిపడేస్తం జాగ్రత్త. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారు.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదు. ప్రజలకు ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే.. సభ పెట్టుకోని చెప్పుకోండి.. అంతేగానీ వేరే పార్టీ సభకు వచ్చి ఏదో చేయాలనుకుంటే..  ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు. సహనానికి హద్దులుంటాయి. మేము హద్దులు మీరితే పరిస్థితులు దారుణంగా ఉంటయ్. తొక్కిపడేస్తం. జాగ్రత్తగా ఉండాలి. రాక్షసులతోనే కొట్లాడిన చరిత్ర మాది.

విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలి

మిషన్ భగీరథ, ఇంటింటీకి నల్లా నీళ్లు ఇచ్చినం. మేము నిరూపించుకున్నం. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు చక్కని విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలి. అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతది. మంచి పాలన వస్తుంది.

మూడు ముక్కలు చేసిండ్రు

తెలంగాణ కవులు, కళాకారులను ఎవరూ నాశనం చేశారో ప్రజలు తెలసుకోవాలి. వాస్తవాలు, చరిత్ర తెలసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పదాన్ని కూడ ఉచ్ఛరించే అధికారం లేదు. తెలంగాణను మూడు ముక్కలు చేసి కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో కలిపిన మూర్ఖులు ఎవరు. రైతుల చనిపోయే దుర్భల పరిస్థతులను తెచ్చింది ఎవరో అందరూ ఆలోచించాలి. పదవులు, స్వార్థం కోసం కాంగ్రెస్ నేతలు తెలంగాణను తాకట్టుపెట్టిండ్రు.

కాళేశ్వరంలోనూ అన్యాయమే..

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ అనాడు అన్యాయం చేశారు. వంచనా చేశారు. 19 కి.మీ. పైన కట్టాల్సిన ప్రాజెక్టు కింద కట్టిండ్రు. పాడెరు కాల్వ వంకర్లు తప్పి ఖమ్మం నోంట్లో మట్టి కొట్టింది ఎవరో ఆలోచించాలి. ఇవి చరిత్ర వాస్తవాలు, జరిగిన చరిత్రను అందరూ తెలసుకోవాలి.

ఒక్కడూ మాట్లాడలేదేందుకు

2007లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసిన. ఏనాడు కాంగ్రెస్ నాయకుడు వచ్చి మాట్లాడలేదు. అనాడు అసెంబ్లీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇయ్యనంటే ఎవ్వడూ మాట్లాడలేదేందుకు.

కమీషన్ల కోసమంటారా..

బంగారు తెలంగాణ కోసం.. ప్రజల  కోసం  ప్రాజెక్టులు మంజూరు చేస్తే.. కమీషన్ల కోసమంటారా.. మీ హయాంలోనూ అదే పని చేశారా.. వీటన్నింటికీ ప్రజలే సమాధానం చెప్పాలే.. మౌనంగా ఉండొద్దు.

నల్గొండలో ఫ్లోరైడ్ రక్కసి ఎందరినో పొట్టనపెట్టుకుంది. ఎనాడైనా మాట్లాడారా… ఎవ్వరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్ పాలనలో ప్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం.

ధరణితో సమస్యలు తీరినయ్

దరణితో రెవెన్యూ లంచాల బాధలు పోయాయా లేదా.. ధరణి వచ్చినంక బాగాలేదా.. ధరణి రాకముందు దండాలు పెట్టి.. లంచాలు ఇచ్చి.. చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇవన్నీ చేసినందుకా కాంగ్రెస్ వోళ్లు పొలం బాట చేసేది… ఎవరి కోసం ఈ బాట  చేస్తున్నది. త్వరలోనే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తది. రైతులకు భూ సమస్యలు లేకుండా చేస్త, దానికి నాది హామీ.

రెండేళ్లనాడు గొర్రెల పంపకానికి 7.50 లక్షల దరఖాస్తులు వచ్చినయ్..ఏటా లక్షల మందికి ఇస్తున్నం…ప్రతి యాదవ కంటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత నాదే.. మత్స్యకారులకు 1.60 లక్షల చేపపిల్లలను పంపిణీ చేసినం.

మోడ్రన్ సెలూన్లకు లక్ష

గ్రామాల్లో చెరువు ఒడ్డు, చెట్ల కింద నడుస్తున్న క్షౌరశాలలు.. రాబోయే కొద్ది రోజుల్లో నాగరికంగా, సంస్కారవంతంగా మోడ్రన్ సెలూన్ లను ఏర్పాటు చేసేందుకు  రూ.1 లక్ష చొప్పున మంజూరు చేయబోతున్నం.

రైతుల ఆత్మగౌరవానికే..

రైతుల బయటకు రావలె.. గ్రామానికే వ్యవసాయ అధికారులు వస్తరు. వారితో రైతులు మాట్లాడాలి. అందుకే రైతు వేదికలు కట్టిస్తున్నం. ఆరు నెలల కాలంలో 6200 రైతు వేదికలు కట్టించినం. రైతులు ఆత్మగౌరవాన్ని మా ప్రభుత్వం నిలబెట్టింది. ఇది వాస్తవం అవునా.. కాదా..

1987లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాలుగు మెక్కలు నాటుదమంటే ఎక్కడ దొరకలే. కానీ ఇవాళ పల్లే ప్రగతి పథకం ద్వారా 12756 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్యాంకులు ఉన్నయా.. లేవా.. అమెరికా నుంచి వచ్చి మెచ్చుకునేలా మన గ్రామాలు మారాలి.

తండాలు.. పంచాయతీలు

3400 పైచిలుకు తండాలను గ్రామ పంచాయతీలు చేశాం.. దాంతో నేడు వారే వారి గ్రామాలను ఏలుకుంటున్నరు.

గుర్తు చేసుకోండి..

బావులు, బోర్లు, చెరువులు నీళ్లతో నిండినయ్. రెండు పంటలు పండుతున్నయ్. చంద్రబాబు హయంలో రెండు పంటలు వేసుకోమని.. కాల్వలు బంద్ చేశారు.. అప్పుడు నేను వచ్చి 50 వేల మందితో మీటింగ్ పెట్టాను. మీరు గుర్తు చేసుకోవాలి.

24 గంటలు కరెంట్ ఇస్తున్నం.. అనాడు కరెంట్ ఎప్పుడొస్తదో తెల్వదు..వచ్చినా ఏ రాత్రిళ్లో వచ్చేవి. పైగా ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతయ్. దేశంలో మరే రాష్ట్రమైన ఉచిత కరెంట్ , రైతు బంధు, ఇస్తున్నదా.. తెలంగాణే  కదా.. కదాంటారా.

గుంట భూమి ఉన్నా రైతు చనిపోయినా వారంలోపల రూ.5 లక్షలు ఇస్తలేమా.. అప్పుడేమా మూష్టి రూ.50 వేలు ఇచ్చేవారు. అది కూడా ఇచ్చేందుకు సవాలక్ష రూల్స్ పెట్టినరు.

మిషన్ భగీరథను పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మెచ్చుకుంటున్న విషయాన్ని కాదంటారా.. అప్పుడు తెలంగాణలో  30 లక్షల ఎకరాల్లో వరి వేసేవారు.. ఇపుడు 1.10లక్షల ఎకరాల్లో వేస్తున్నారు.  మరో నెలన్నరలో మరో 10- 15 ఎకరాల్లో వరి పండే అవకాశం ఉంది.

కల్యాణలక్ష్మీ గతంలో ఎవరైనా ఇచ్చారా.. ఇప్పుడు మేము ఇస్తలేమా.. 50 లక్షల మంది పేదలకు కండ్లద్దాలు ఇయ్యలేదా.. మీరందరికీ గుర్తు లేదా… ఇండియాలో ఎవరైనా ఇచ్చినారా..

కేసీఆర్ కిట్.. పేదల అడ బిడ్డలకు ఆదుకుంటలేదా… ప్రైవేటు దోపిడీని అడ్డుకున్నం.. బిడ్డలు పుడితే పైసలు ఇస్తలేమా.. గతంలో నేతలు ఇలా చేశారా..

లంచం ఇయ్యకుండానే రైతు బంధు వస్తలేదా.. కాంగ్రెస్ హయంలో ఇచ్చారా.. అవినీతి రహిత గవర్నమెంట్ మాది.

ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు కడుతున్నం. కాంగ్రెస్ వాళ్లు ఎందుకు చేయలే..

నేను చెప్పేది నిజమే కాకుంటే టీఆర్ ఎస్ పార్టీని ఓడియ్యండి. మాకు ఓటడిగే హక్కు ఉన్నది. లేదంటే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాకుండా ఓడించండి.

గతంలో ఎవరైనా యాదగిరి గుట్టను కట్టాలని ఆలోచన చేశారా.. నేడు యాదాద్రి అద్భుంగా కడుతున్నం. తెలంగాణ ఖ్యాతి పెరిగేలా మేము పాటు పడుతున్నం.

అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. రాష్ట్రంలో దళితుల కోసం రూ.1000 కోట్లతో ‘సీఎం దళిత్ ఎంపావర్ మెంట్ స్కీం’ పెట్టబోతున్నం.

బంగారు తెలంగాణ సాధనకు నూరు శాతం పనిచేస్తున్నం. మీ ఆశీర్వాదమే మాకు బలం.

పథకాలు పూర్తి చేయకపోతే..వచ్చే ఎన్నికల్లో ఓట్టడగం అనేందుకు ఎంత ధైర్యం ఉండాలి.

రాజకీయ గుంటనక్కల మాటలకు మోసపోవద్దు.. నాకు అండగా ఉండండి.. మీమ్మల్ని బాగు చేసే బాధ్యత నాది.

- Advertisement -

Latest news

Related news