25.4 C
Hyderabad
Sunday, January 17, 2021

ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. మూడురోజుల పర్యటన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికై శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. నిన్న (శనివారం) ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తక్షణ వరద సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరుచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.  

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురిని కూడా సీఎం కేసీఆర్ కలిశారు. సిద్దిపేట సహా ఆరు విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. శుక్రవారం కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు.

- Advertisement -

Latest news

Related news

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...