తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగ రావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు.
ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల ముందుండి నడిపించారని సీఎం కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటన్నారు. బూర్గుల నర్సింగరావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.