సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఉన్నారు.