సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లోని రైతులతో మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటి మామిడి కూరగాయల మార్కెట్లో రైతుల నుంచి ఏజెంట్లు 4శాతం కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని హెచ్చరించారు.
రైతులను ఆగం చేయాలని చూస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు పండించిన కూరగాయలు నిల్వ చేసుకునేందుకు వీలైనంత త్వరలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఇందుకు గానూ.. 50 ఎకరాల స్థలాన్ని వెంటనే గుర్తించాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.