27.4 C
Hyderabad
Sunday, January 17, 2021

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు అడగకుండానే వరాలిచ్చారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం సంతకం కూడా పూర్తయింది.

రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి 9,36,976 మంది ప్రభుత్వోద్యోగులు ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు,  గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకు, దినసరి వేతన, పూర్తిస్థాయి కాంటింజెంట్‌, పార్ట్‌టైం కాంటింజెంట్‌, సెర్ప్‌ ఉద్యోగులకు కూడా పెంపు వర్తిస్తుందని సీఎం తెలిపారు. హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్లలతో పాటు గౌరవ వేతనాలు అందుకుంటున్న అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందన్నారు.

- Advertisement -

Latest news

Related news

పూరి-విజయ్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ట్రెండీ హీరో విజయ్ దేవరకొండ.. ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. అయితే...

నేను తెలుగింటి అల్లుడిని

సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైంలో ఎంతోమంది వలస కూలీలకు సాయం చేసి వాళ్లని సొంత ఊర్లకు...

టీమిండియా ఆలౌట్.. స్కోర్స్ ఎంతంటే..

గబ్బాలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 33 పరుగుల ఆధిక్యం సాధించింది....

ఆచార్య కోసం ‘సిద్ధ’మైన రామ్ చరణ్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. కొడుకు రామ్‌చరణ్‌ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో...