29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటన షెడ్యూల్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు న‌ల్లగొండ జిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు. ఉద‌యం 11:45 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో న‌ల్లగొండ‌కు బ‌య‌లుదేర‌తారు. ఆ తర్వాతి షెడ్యూల్ ఇది..
మ‌ధ్యాహ్నం 12:30 నందికొండ‌కు చేరుకుంటారు.
12:40 గంట‌ల‌కు రోడ్డుమార్గాన నెల్లిక‌ల్లుకు వెళ్తారు.
12:45 గంట‌ల‌కు నెల్లిక‌ల్లులో 13 లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఒకే చోట శంకుస్థాప‌న. అనంత‌రం 12:55 గంట‌ల‌కు నాగార్జున‌సాగ‌ర్ చేరుకుంటారు.
ఒంటిగంట‌కు హిల్ కాల‌నీ చేరుకొని.. మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంట్లో లంచ్ చేయ‌నున్నారు.
మ‌ధ్యాహ్నం 3:10 గంట‌ల‌కు హాలియా బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగం.
సాయంత్రం 4:10 గంట‌ల‌కు హైద‌రాబాద్‌కు తిరుగు ప్రయాణం.

- Advertisement -

Latest news

Related news