ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 9 ఆపై తరగతులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సమావేశం తర్వాత సబితా మాట్లాడుతూ.. ఈ నెల 25 లోపు అంతా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం తరగతి గదిలో విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దని, విద్యార్థుల హాజరు విషయంలో ఎలాంటి ఒత్తిడి పెట్టొద్దని అధికారులకు సూచించారు. సంక్షేమ హాస్టళ్లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.