28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

రాష్ట్రానికి చేరిన కరోనా వ్యాక్సిన్

జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే కరోనా వ్యాక్సినేషన్ కోసం అవసరమైన వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్కడ్నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో  శంషాబాద్ విమాన‌శ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి కోఠిలోని కోల్డ్ స్టోరేజీకి తరలించారు. దాదాపు 3.72 ల‌క్షల డోసులు వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.

రాష్ర్ట వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను త‌ర‌లించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయ‌నున్నారు. తొలివిడుతలో 2.90 ల‌క్షల మంది ప్రభుత్వ‌, ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా వేయ‌నున్నారు.

- Advertisement -

Latest news

Related news

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...