తెలంగాణలో ఫ్రంట్ వారియర్స్ కు కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా పోలీసులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ టీకా చాలా సురక్షితమైందన్నారు. టీకాపై అనుమానాలు, అపోహలు వద్దని డీజీపీ సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కొవిడ్ టీకా వేయించుకున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో భయాలు, అపోహలు తొలగించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. త్వరలోనే సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని డీజీపీ చెప్పారు.