కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్(సీపీజెట్) 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. టి. పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 51 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీజెట్కు 85,270 అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో 72,467 మంది ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. ఇందులో 70,141(96.79 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి అర్హత పొందారు. అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా ర్యాంకు కార్డులను www.tscpget.com, www.osmania.ac.in and www.ouadmissions.com. వెబ్‌సైట్స్‌కు లాగినై తెలుసుకోవచ్చు.
జనవరి 12 నుంచి 24వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలను చేపట్టనున్నారు. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. జనవరి 29, 30వ తేదీల్లో సీట్ అలాట్మెంట్ను ప్రకటించనున్నారు.