సైబరాబాద్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2021 లో భాగంగా సీపీ సజ్జనార్ ఆదివారం కాసేపు క్రికెట్ ఆడారు. ఈ నెల చివర్లో జరగనున్న సైబరాబాద్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2021 కార్యక్రమానికి ప్రాక్టిస్ గా ఆయన క్రికెట్ ఆడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు. దానికోసం రోజూ కాసేపు స్పోర్ట్స్ ఆడాలని సూచించారు.