18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ

ఆన్ లైన్ లో సులువుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి మొదలైనట్టు సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే.. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుందని.. లేకపోతే రిజిస్ట్రేషన్ ఉండదని తెలిపారు. పీటీఐఎన్ సంఖ్య లేని వారు కూడా ఆ సంఖ్య కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరో రెండు రోజుల్లో పీటీఐన్ సంఖ్య అలాట్ చేస్తామని సీఎస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులకు ఎలాంటి విచక్షణ అధికారాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

ఆన్ లైన్ ద్వారా లేదా చాలనా ద్వారా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి.. ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆస్తుల అమ్మకం, గిఫ్ట్, సేల్ అగ్రిమెంట్, మార్ట్ గేజ్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ వంటి కొన్ని సేవలు తక్షణమే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 96 శాతం సర్వీసులు వెంటనే ప్రారంభిస్తున్నామని.. మిగతావి త్వరలో ప్రారంభిస్తామని సీఎస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కూడా ఆన్ లైన్ లో వెంటనే జరుగుతుందని.. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆస్తులు, వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డాటాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావివ్వకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అవసరమైన సలహాలు, సహాయం కోసం 24 లైనల్తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. 18005994788 నెంబరుకు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చని తెలిపారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించిన సీఎస్ సోమేశ్ కుమార్.. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు కేటాయించినట్టు వెల్లడించారు.  రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే డాక్యుమెంట్లు జారీ చేస్తామన్నారు.  ఎల్ఆర్ఎస్ లేని వారి విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వంద మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్ లో వార్ రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...