29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

యువతుల అతి తెలివి.. రజినీ డైలాగ్‌తో పంచ్

‘అతిగా ఉల్లంఘనలు చేసే వాహనదారులు, చలానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ దాచే వాళ్ళు  తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రియేట్ చేసిన మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని, భలే ఫన్నీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

చలానాలు తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లు కనపడకుండా ఓ యువతి తన బండి నెంబర్ ప్లేట్ కి అడ్డంగా ముఖానికి పెట్టుకునే మాస్కు కట్టింది. పైగా ట్రిపుల్ రైడింగ్ తో రోడ్లపై దూసుకుపోయింది. ఇలా ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు అతి తెలివి చూపే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘నరసింహ’ సినిమాలో చెప్పే ఫేమస్ డైలాగ్ ను మార్చి దాంతో ఓ మీమ్ వదిలారు. మాస్కు కట్టి ట్రాఫిక్ చలానా తప్పిందని భావించిన యువతులకి ట్రాఫిక్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. సీసీ కెమెరాతో బండి ముందలి ఫోటో తీసి చలానా విధించి వారి తిక్క కుదిర్చారు. బండిపై ఇద్దరు హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.300, ట్రిపుల్ రైడింగ్ కు రూ.1200, ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ ని దాచినందుకు రూ.500 ఇలా మొత్తం రూ.2000 చలానా వేశారు.

- Advertisement -

Latest news

Related news