కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నీట్ 2020-21 యూజీ అర్హత కటాఫ్ స్కోరును 10 పర్సెంటైల్ తగ్గించింది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజి హెల్త్ యూనివర్సిటీ అభ్యర్థులకు సూచించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలన్నారు.
తగ్గిన కటాఫ్ స్కోర్
జనరల్ అభ్యర్థులు 40 పర్సెంటైల్.. 113 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 30 పర్సెంటైల్.. 87 మార్కులు, దివ్యాంగులకు 35 పర్సెంటైల్.. 99 మార్కులు.