భూ తగాదాల శాశ్వత పరిష్కారానికే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో ధరణిపై మంత్రి హరీశ్ రావు బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా భూ తగాదాలు పరిష్కారం కావడం లేదని, దాంతో ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ధరణి తెచ్చిందన్నారు. ఇన్నాళ్లూ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమి రికార్డులు వ్యవస్థలోకి వచ్చాయన్నారు. దేశంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. లంచాలు ఇయ్యకుండా.. పారదర్శకంగా పట్టా పాస్‌బుక్‌లు ధరణి ద్వారా వస్తాయన్నారు. ధరణితో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూముల విషయాల్లో తలదూర్చే అవకాశం లేకుండా చేశామన్నారు.