కరోనా వ్యాక్సిన్‌పై అనుమానం అక్కర్లేదని.. చాలా సురక్షితమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. అపోహలు నమ్మకుండా ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆమె సూచించారు. చాలామంది మీరు టీకా తీసుకున్నారా.? అని అడుగుతున్నారని, సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాకనే టీకా తీసుకుంటానని గవర్నర్ చెప్పారు. సనత్‌నగర్ ఈఎస్ఐ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కరోనా టీకాను తయారు చేసి దేశం స్వయం సమృద్ధి సాధించిందని గుర్తుచేశారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ టీకా తీసుకునేందుకు భయపడొద్దని గవర్నర్ ధైర్యం నింపారు.